MDK: నర్సాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో మండల లీగల్ సర్వీస్ కమిటీ ఛైర్మన్ ఆదేశాల మేరకు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ న్యాయవాది సుధాకర్, ఎస్సై రంజిత్ రెడ్డి, టీడీపీవో హేమ భార్గవి, ఎంఈవో తారా సింగ్, లీగల్ సర్వీసెస్ న్యాయవాది మధుశ్రీ శర్మ, స్వరూప రాణి పాల్గొని విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించారు.