VSP: ఎయిర్ పోర్ట్ పర్యావరణ కమిటీ సమావేశం విశాఖ కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నిర్వహించారు. డ్రెయిన్ల ద్వారా మురుగు, వర్షపు నీరు సాఫీగా పోయేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎయిర్ పోర్టు పరిసరాల్లో నిర్మాణ సామగ్రి, చెత్తా చెదారం డంపింగ్ చేయకుండా పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు.