ASR: ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో ఎంపికైన 24 మంది నూతన ఉపాధ్యాయులను కొయ్యూరు మండలానికి కేటాయించారని ఎంఈవో రాంబాబు మంగళవారం తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలలకు 12 మందిని, మిగిలిన 12మందిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించారని తెలిపారు. నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించామన్నారు. వారికి పాఠశాలలు కేటాయించామని తెలిపారు.