GNTR: గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న సబ్-సీ కేబుల్ ల్యాండింగ్ సెంటర్ ఒప్పందం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఇవాళ అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దార్శనికతకు ఇది నిదర్శనమని తెలిపారు. విశాఖలో దేశంలోనే తొలి ఏఐ హబ్ ఏర్పాటుతో ప్రత్యక్ష, పరోక్షంగా 1.88 లక్షల ఉద్యోగాలు కలగనున్నాయని ఆయన పేర్కొన్నారు.