ప్రకాశం: టిఫిన్‌లో సాంబార్ నాణ్యత బాగాలేదని ప్రజలు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మంగళవారం తీగలగొందిలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా నాణ్యత పరిశీలించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజనం నాణ్యత లోపిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఛైర్మన్ హెచ్చరించారు.