AP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం అని హోంమంత్రి అనిత సంతోషం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ రాకతో ఉత్తరాంధ్ర ప్రపంచపటంలో నిలుస్తుందన్నారు. డేటా సెంటర్ ఏర్పాటుతో 1.88 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. విశాఖను ఐటీ హబ్‌గా మార్చుతున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.