ASR: జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమిత్ బర్దార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో క్రైం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. గ్రామాల్లో మహిళలు, చిన్నారుల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.