VZM: బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలకు సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. తాత్కాలిక షాపులు పట్టణ శివార్లలోని బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణకు నీరు, ఇసుక తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.