SRPT: తిరుమలగిరి మండలం తొండలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఆరు గొర్రెలు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా నడపడం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని గ్రామ ప్రజలు తెలిపారు. గొర్రెల యజమానికి వెంటనే ఇసుక ట్రాక్టర్ యజమాని నష్టపరిహారం చెల్లించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.