NLR: అల్లూరు మండలంలోని ఇసుకపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం మాల్యాద్రి మాట్లాడుతూ.. విద్యార్థినిలు అందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. చదువుకోవడం వలన కలిగే లాభాలను విద్యార్థినిలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సౌజన్య పాల్గొన్నారు.