BDK: మణుగూరు మండల కేంద్రంలో ఏఐటీయూసీ మహాసభ రాయల బిక్షం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పుల్లారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఆటో కార్మికులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు కారణంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా మారిందని పేర్కొన్నారు.