KRNL: ప్రధాని మోదీ పర్యటనకు 3,300 బస్సులు ఏర్పాటు చేసినట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో జిల్లాలో సమీక్ష, పర్య వేక్షణ చేపట్టారు. కర్నూలు సభకు 3,070, శ్రీశైలానికి 150, భద్రతా సిబ్బందికి 80 బస్సులు కేటాయించామన్నారు. పూర్తి ఫిట్నెస్ బస్సులనే వినియోగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.