ASR: రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అరకు సీఐ ఎల్.హిమగిరి వాహనదారులకు సూచించారు. మంగళవారం రాత్రి డుంబ్రిగుడ మండలం చాపరాయి జలపాతం వద్ద ఎస్సై కే.పాపినాయుడుతో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పలువురికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రహదారి నిబంధనలు పాటించాలని తెలిపారు.