నాగర్ కర్నూల్: అచ్చంపేట నియోజకవర్గం మండల పరిధిలోని చెంచు మహిళలకు ఇందిరమ్మ ఇంటి పట్టాలను ఇవాళ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెంచు కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పేద ప్రజలకు అండగా నిలబడమే కాంగ్రెస్ ప్రభుత్వ నైజం అని వెల్లడించారు.