HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎర్రగడ్డ డివిజన్లో కూకట్ పల్లి MLA మాధవరం కృష్ణారావు ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలు మళ్లీ కాంగ్రెస్ మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. గత BRS ప్రభుత్వ సంక్షేమ పథకాలను గుర్తించుకొని ప్రజలు ఓటు వేస్తారన్నారు.