W.G: పల్లె పల్లెకు మన పితాని కార్యక్రమంలో భాగంగా ఇవాళ వల్లూరులో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పర్యటించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. స్మశాన వాటికలు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి ప్రధానమైన సమస్యలను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.