CTR: జిల్లాలో మామిడి రైతుల ఖాతాలోకి రాయితీ ధర మొత్తాన్ని జమ చేసినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం వెల్లడించారు. 34 మండలాల పరిధిలోని 32,000 మంది రైతుల ఖాతాలోకి రూ. 147 కోట్ల నగదును జమ చేసినట్టు ఆయన తెలియజేశారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన మేర కేజీకి రూ.4 చొప్పున చెల్లించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.