TPT: శ్రీవారి ఆలయంలో 30న పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరగనుంది. ముందురోజు 29న రాత్రి 8 నుంచి 9 గంటల వరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ మేరకు పుష్పయాగం రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లకు సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగుతుంది.