»Technical Glitch 820 Crores Deposite To Account Holders
Account Holders అకౌంట్లలో రూ.820 కోట్లు జమ.. ఆ వెంటనే..?
యూకో బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలో రూ.820 కోట్ల నగదు జమ అయ్యింది. సాంకేతిక తప్పిదం వల్ల ఇలా జరిగిందని.. 79 శాతం నగదు రివకరీ చేశామని బ్యాంక్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Technical Glitch, 820 Crores Deposite To Account Holders
Account Holders: సాంకేతిక కారణంతో యూకో బ్యాంక్ నుంచి ఖాతాదారుల అకౌంట్లలో (Account Holders) రూ.820 కోట్ల నగదు జమయ్యింది. ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్)లో టెక్నికల్ ఇష్యూ వల్ల నగదు క్రెడిట్ అయ్యింది. వెంటనే స్పందించిన బ్యాంక్ యాజమాన్యం.. నగదు జమ అయిన అకౌంట్లను బ్లాక్ చేసింది. అలా 79 శాతం.. అంటే రూ.649 కోట్లను రికవరీ చేసింది. మరో రూ.171 కోట్లు రికవరీ చేయాల్సి ఉంది.
బ్యాంక్లో (bank) జరిగిన పొరపాటు నిన్న (బుధవారం) వెలుగులోకి వచ్చింది. ఇతర బ్యాంకులకు చెందిన వినియోగదారులు చేసిన పేమెంట్ తమ బ్యాంకులకు చెందిన ఖాతాల్లో జమ అయ్యిందని తొలుత భావించింది. ఈ నెల 10-13వ తేదీల్లో ఐఎంపీఎస్లో సాంకేతిక లోపం వల్ల ఇలా పొరపాటు జరిగిందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయినట్టు చూపించింది.. కానీ నగదు మాత్రం రాలేదు.
వెంటనే ఐఎంపీఎస్ చానెల్ ఆఫ్ లైన్ చేశామని యూకో బ్యాంక్ పేర్కొంది. దాంతో మిగతా సొమ్ము వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే ఐఎంపీఎస్ ద్వారా మెజార్టీ సొమ్ము రికవరీ చేశారు. మిగతా సొమ్ము వెనక్కి తీసుకొచ్చేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ సాయం తీసుకుంటామని తెలిపింది. దీంతో గురువారం యూకో బ్యాంక్ షేర్లు ఎన్ఎస్ఈలో ఒక శాతం నష్టంతో రూ.39.35 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.