మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో కోయిల్ సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం ప్రభుత్వం రూ.50 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఇతర పర్యాటక ప్రదేశాల మాదిరిగానే కోయిల్ సాగర్ కూడా మారుతుందన్నారు.