Sundar Pichai: పశ్చాత్తాపం చెందిన గూగుల్ సీఈఓ..ఎందుకంటే?
ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. గుగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఉద్యోగులతో సమావేశమవ్వగా.. ఓ ఉద్యోగి అడిగిన ప్రశ్నకు అతను ఇలా సమాధానమిచ్చారు.
Sundar Pichai గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ 2023లో 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఈ నిర్ణయం వల్ల చాలా మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందారు. ఇదే విషయంపై తాజాగా సుందర్ పిచాయ్ పశ్చాత్తాపం తెలిపారు. ఇటీవల ఆయన ఉద్యోగులతో సమావేశమయ్యారు. భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించడం ద్వారా మీరేం సాధించారని ఓ ఉద్యోగి సుందర్ పిచాయ్ను ప్రశ్నించాడు.
ఉద్యోగి ప్రశ్నకు సుందర్ పిచాయ్ సమాధానం ఇస్తూ.. ఉద్యోగులను తొలగించడం తప్పేనని అంగీకరించారు. మేం ఉద్యోగులను తీసి ఉండాల్సింది కాదని అన్నారు. అప్పుడు మేం తీసుకున్న నిర్ణయం తప్పేనని అన్నారు. అప్పటి పరిస్థితులు వల్ల ఉద్యోగులను తీయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులను తీయకుండా వేరేలా వ్యవహరిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే అది మరింత ప్రతికూల ఫలితాలకు దారితీసేదని పిచాయ్ పేర్కొన్నారు.