»Explosion In Explosive Solar Company Nagpur Maharashtra 9 People Died
Explosion: పేలుడు పదార్థాల కంపెనీలో పేలుడు..9 మంది మృతి
పేలుడు పదార్థాల తయారు చేస్తున్న ఓ సోలార్ ఇండస్ట్రీస్‌లో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృత్యువాత చెందగా..పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Explosion in explosive solar company nagpur maharashtra 9 people died
మహారాష్ట్ర(maharashtra)లోని నాగ్‌పూర్ జిల్లాలో పేలుడు(blast) పదార్థాల తయారీ కంపెనీలో ఆదివారం జరిగిన పేలుడులో కనీసం తొమ్మిది మంది మరణించారు. నాగ్‌పూర్‌లోని బజార్గావ్ గ్రామంలోని సోలార్ ఇండస్ట్రీస్‌లో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9 గంటలకు కంపెనీలోని కాస్ట్ బూస్టర్ యూనిట్లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాస్ట్ బూస్టర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందని నాగ్‌పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ తెలిపారు.
అయితే అసలు పేలుడు ఎలా జరిగిందనే విషయం గురించి అధికారులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు పేలుడుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించే పనిలో పడ్డారు. ఆ పేలుడు ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా ప్లాన్ చేశారా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లేదా ఈ సంస్థకు ఏదైనా అప్పులు ఉన్నాయా బీమా నష్టం కోసం ఏదైనా బ్లాస్ట్ ప్లాన్ చేశారా అనే వివరాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.