ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు కృత్రిమ మేధ. ఈ అత్యాధునికి టెక్నాలజీ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ ఉద్యోగి జోన్స్ లేఖ రాశారు.
AI Tools: ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు కృత్రిమ మేధ. ఈ అత్యాధునికి టెక్నాలజీ వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. అయితే ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగి షేన్ జోన్స్ రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. కంపెనీకి చెందిన ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ అసభ్యకర కంటెంట్ సృష్టికి దారితీస్తోందని ఆరోపించారు. దీన్ని అరికట్టేందుకు సంస్థ తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ మేరకు ఆయన కంపెనీ బోర్డుతో పాటు ఫెడరల్ ట్రేడ్ కమిషన్, చట్ట సభ్యులకు లేఖ రాశారు.
ఓపెన్ఉఐకి చెందిన డెయిల్-ఈ ఇమేజ్ జనరేటర్ మోడల్లో భద్రతాపరమైన లోపాన్ని కనుగొన్నట్లు షేన్ జోన్స్ తెలిపారు. ఇది హానికరమైన చిత్రాలను సృష్టించకుండా టూల్లో ఏర్పాటు చేసిన కట్టుబాట్లను దాటవేయడానికి అనుమతించినట్లు తెలిపారు. అతను గుర్తించిన ఆ విషయాలను మైక్రోసాఫ్ట్‌కు నివేదించినట్లు జోన్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో మరిన్ని భద్రతా ఏర్పాట్లను పొందుపర్చే వరకు కోపైలట్‌ను ఉపయోగంలో నుంచి తొలగించాలని కోరినట్లు వెల్లడించారు.