»Delhi Court Asking Wife To Do Household Chores Is Not Wrong
Delhi Court: ఇంటి పనులు చేయాలని భార్యను కోరడం తప్పుకాదు
వివాహితను ఇంటి పనులు చేయమని భర్త కోరడం క్రూరత్వం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక బంధంలో ఇద్దరు బాధ్యతలు పంచుకోవడం ముఖ్యమని కోర్టు తెలిపింది.
Delhi Court: వివాహితను ఇంటి పనులు చేయమని భర్త కోరడం క్రూరత్వం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక బంధంలో ఇద్దరు బాధ్యతలు పంచుకోవడం ముఖ్యమని కోర్టు తెలిపింది. తల్లిదండ్రులను విడిచి తనతో ఉండమని ఓ భార్య కోరింది. దీంతో ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇంటి పని చేయమని అడగటంతో తన భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని ఓ వ్యక్తి ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విడిచి వేరే కాపురం పెట్టాలని భార్య వేధిస్తున్నట్లు తెలిపాడు. ఈ కారణంగానే విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోరాడు.
కేసును పరిశీలించిన న్యాయస్థానం విడాకులు మంజూరుకు నిరాకరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన న్యాయస్థానం వివాహితను ఇంటి పనులు చేయమని భర్త కోరడం తప్పు కాదంటూ సమర్థించింది. బాధ్యతలను దంపతులు పంచుకోవడమే వివాహబంధమని గుర్తుచేసింది. తన కుటుంబానికి స్త్రీ చేసే సేవను ఆప్యాయతగా పరిగణించింది. అది సాయంతో సమానం కాదని తెలిపింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వదలి రమ్మని భర్తను కోరడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడుదేనని న్యాయస్థానం తెలిపింది.