దుబాయ్ యువరాణి షేక్ మహ్రా మొహమ్మద్ రషీద్ ఆల్ ముక్తుమ్ సంచలన ప్రకటన చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదిక తన భర్తకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.
The sensational decision of the princess of Dubai... Divorce two months after the birth of the child
Dubai Princess: దుబాయి యువరాణి షైఖా మహ్రా మహ్మద్ రషీద్ అల్ మక్తూమ్ సంచలన ప్రకటన చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భర్తకు విడాకులిచ్చారు. తన భర్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్‌తో తన వివాహ బంధానికి పుల్ స్టాప్ పెడుతున్నట్లు చెప్పారు. వీరికి ఒక బిడ్డ కూడా ఉన్నారు. ఆ పాప జన్మించి రెండు నెలలు మాత్రమే అవుతుండడం గమనార్హం. షైక్ మొహ్రా ఇన్‌స్టా పోస్ట్ చేస్తూ.. ‘ప్రియమైన భర్తకు.. మీరు ఇతరులతో సంతోషంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అందుకే నేను మీకు విడాకులు ఇస్తున్నాను. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.. మీ మాజీ భార్య ’ అంటూ షైఖా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ తరువాత ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేసుకున్నారు. ఇద్దరు కలసి తీసుకున్న ఫోటోలను సైతం డిలీట్ చేశారు.
దుబాయి రూలర్ అయిన షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె షైకా మొహ్రా. ఈ యువరాణి దుబాయికి వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ను 2023 మే 27న పెళ్లి చేసుకున్నార. వీరి బంధానికి గుర్తుగా రెండు నెలల క్రితం ఓ కూతురు కూడా జన్మించారు. ఇంతలోనే తన నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశం అయింది. షైకా మంచి విద్యావేత్త. అంతర్జాతీయ వ్యవహారాల్లో మంచి నేపుణ్యం కలిగి ఉన్నారు. ఆమె మహిళ సాధికాతర కోసం కృషి చేస్తున్నారు. ఆమె నిర్ణయాన్ని పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇక తన కూతురుతో ఆనందంగా ఉన్న ఫోటోను స్టోరీలో పెట్టారు. ఇకపై మనమిద్దరమే అనే క్యాప్షన్ కూడా పెట్టారు.