»Telangana High Court Invalidates Appointment Of Kodandaram And Ali Khan Mlcs
High Court: కోదండరాం, అలీఖాన్ ఎమ్మెల్సీల నియామకం చెల్లదన్న హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం చేపట్టింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోదండరామ్, అలీఖాన్‌ల నియామకం చెల్లదని హై కోర్టు తీర్పునిచ్చింది.
Telangana High Court invalidates appointment of Kodandaram and Ali Khan MLCs
High Court: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీలు (MLC)గా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామిస్తూ గవర్నర్ అమోదం కోరారు. గవర్నర్ అమోదం లభించగానే ఎన్నికల కమిషన్ సైతం అమోదించింది. అయితే ఈ ఎమ్మెల్సీల నియామకాన్ని సవాలు చేస్తూ.. బీఆర్ఎస్ నేతలు దసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో వీరిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే దాన్ని గవర్నర్ తమిలసై సౌందర్ రాజన్ తిరస్కరించారు.
ఈ నేపథ్యంలో వారి నియామకం ఎలా తిరస్కరిస్తారని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎమ్మెల్సీ నియామాన్ని పున:పరిశీలించాలని పేర్కొంది. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని సూచించింది. కేబినెట్‌కు తిప్పిపంపాలి తప్ప తిరస్కరించకూడదని వెల్లడించింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్ లేదని పేర్కొంది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీ నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.