»Big Threat Due To Ai Girlfriends Expert Warning For Youth
AI GirlFriend: ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ వల్ల పెనుముప్పు.. యువతకు నిపుణుల వార్నింగ్
ఏఐ టెక్నాలజీ ద్వారా చాలా మంది యువత వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్స్‌ను క్రియేట్ చేసుకుని వాటితో జీవిస్తున్నారు. ఈ విధానం ఎక్కువగా అమెరికాలోని యువత పాటిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. దీని వల్ల మగవారు ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని, బర్త్ రేట్స్ కూడా చాలా వరకూ తగ్గిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈమధ్య కాలంలో ఏఐ టెక్నాలజీ (AI Technology) వాడకం విపరీతంగా పెరిగింది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల వర్చువల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గర్ల్‌ఫ్రెండ్స్ (Virtual Artificial Intelligence Girlfriends) ఎక్కువగా పెరిగిపోతున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఈ ట్రెండ్ బాగా పెరిగిందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల యువతలో ఒంటరితనం మరింత పెరుగుపోతోందని, ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ అందుబాటులోకి రావడంతో పురుషులు వాటితో ఒంటరిగానే బతకడానికి నిర్ణయించుకుంటున్నట్లుగా ప్రొఫెసర్ లిబర్టీ విటెర్ట్ హెచ్చరిక చేశారు.
అమెరికా ప్రొఫెసర్ అయిన లిబర్టీ విటెర్ట్ (Professor Libarti Vitert) మాట్లాడుతూ ఈ ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ వ్యవస్థపై షాకింగ్ కామెంట్స్ చేశారు. 18 ఏళ్ల విద్యార్థులు ఎక్కువగా సోషల్ మీడియా యాప్స్ వాడుతున్నారన్నారు. ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ (AI GirlFriends) ఉన్నారని వారు ధైర్యంగా చెబుతున్నారని, దాని వల్ల వారు సింగిల్ గానే ఉండే అవకాశం ఉందని ప్రొఫెసర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటివి భవిష్యత్తులో ఎక్కువైతే యువత ప్రమాదంలో పడినట్లే అవుతుందన్నారు.
ఈ ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ (AI GirlFriends) ఎక్కువగా మచ్చటిస్తాయని, అబ్బాయిలను ప్రేమిస్తాయని, పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్‌ను అవి క్రియేటే చేస్తాయని, దాని వల్ల ఇతరులతో గడపడానికి మనుషులు ఇష్టపడని స్థితికి వెళ్తారని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ యాప్ అయిన రెప్లికాలో (Replica App) ఈ ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ ఎక్కువగా క్రియేట్ చేసుకున్నారని తెలిపారు.
ఏఐ టెక్నాలజీ (AI Technology) వచ్చాక చాలా మంది మగవారు తమ ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ (Artificial Intelligence Girlfriends)ను క్రియేట్ చేసుకుని వాటితోనే గడుపుతున్నారని, దాని వల్ల వారు ఒంటరితనాన్నే ఎక్కువగా అనుభవిస్తున్నారన్నారు. దీని వల్ల బర్త్ రేట్స్‌పై (Birth Rates) కూడా ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.