KRNL: గోనెగండ్లలో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన వైద్య సిబ్బంది, పంచాయతీ అధికారులు కేసు నమోదైన ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. డోర్ టు డోర్ ఫీవర్ లార్వా సర్వే కూడా చేపట్టారు. ఎంపీహెచ్వో కృష్ణుడు రక్త నమూనాలు సేకరించినట్లు, ప్రజలకు దోమల నివారణపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.