youngest MP: కేంద్ర మంత్రి వర్గంలో టీడీపీకి ప్రాధాన్యత
ప్రధాని నరేంద్ర మోడీ కొత్త టీమ్ ఏర్పాటయింది. కూటమిలో ఎంపీలకు కూడా ఈసారి కేబినెట్లో స్థానం దక్కింది. ఏపీ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రామ్మోహన్ నాయుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు.
youngest MP: ప్రధాని నరేంద్ర మోడీ కొత్త టీమ్ ఏర్పాటయింది. కూటమిలో ఎంపీలకు కూడా ఈసారి కేబినెట్లో స్థానం దక్కింది. ఏపీ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రామ్మోహన్ నాయుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు.
కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత టీడీపీ నాయకుడు కింజరపు ఎర్రన్నాయుడు కుమారుడు. శ్రీకాకుళంలో 1987లో ఎర్రన్నాయుడు దంపతులకు జన్మించిన రామ్మోహన్ నాయుడు చిన్నతనం నుంచే చురుగ్గా ఉండేవాడు. ఆర్కే పురంలోని ప్రఖ్యాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత విదేశాల్లో విద్యను అభ్యసించారు. ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐస్లాండ్లో ఎంబీఏ పూర్తి చేశారు. సింగపూర్లో ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో తండ్రి మరణించారు. 2012లో ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో … తప్పనిసరి పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అప్పటి వరకు సింగపూర్లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్న రామ్మోహన్ నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు
2014లో తొలిసారిగా తెలుగు దేశం పార్టీ తరపున శ్రీకాకుళం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికయ్యారు. 16వ లోక్సభలో అత్యంత పిన్న వయసు కలిగిన రెండో ఎంపీగా రామ్మోహన్ నాయుడు అందరి దృష్టిని ఆకర్షించారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టు కలిగిన రామ్మోహన్ నాయుడు అనతికాలంలోనే మంచి పేరు సంపాదించారు. లోక్సభలో చేసే ప్రసంగాల్లో ఎంతో స్పష్టంగా తన భావాలను వ్యక్తీకరించేవారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఎంపీగా విజయం సాధించారు. అధినేత చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వర్తించేవారు. ఇక 2024లోనూ శ్రీకాకుళం స్థానం నుంచి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. మోడీ మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. కీలక పదవిని దక్కించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించే దిశగా అడుగులు వేయనున్నారు.