»Hyundai Motor India Rolls Out Grameen Mahotsav In 16 New Locations
Hyundai : గ్రామీణ ప్రాంతాలవైపు.. హ్యుందాయ్ చూపు
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారిని ఆకట్టుకోవడంపై ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ దృష్టి సారించింది. గ్రామీణ్ మహోత్సవ్ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Hyundai Grameen Mahotsav : మన దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారిని ఆకట్టుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ‘గ్రామీణ మహోత్సవ్’(Grameen Mahotsav) పేరుతో ఓ క్యార్యక్రమాన్ని అమలు చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 16 కొత్త గ్రామీణ ప్రాంతాల్లో తమ వాహనాలను ప్రదర్శించనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా వాహనాలను ప్రదర్శించడమే కాకుండా జనాలన్ని ఆకట్టుకునేందుకు ఫోక్ డ్యాన్సులు, లైవ్ మ్యూజిక్ లాంటి వాటిని ఏర్పాటు చేయనుంది. ఆ రకంగా స్థానికంగా ఉండే వారిని ప్రోత్సహించి తమ వాహనాల మోడళ్ల పై ప్రచారం చేయనుంది. ఈ విషయమై హ్యుందాయ్ మోటార్ ఇండియా(Hyundai Motor India) సంస్థ కొన్ని విషయాలను వెల్లడించింది. ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. దీంతో గ్రామాల్లో ఆదాయాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
గ్రామాల్లో ఆదాయ వనరులు పెరిగినప్పుడు మౌలిక సదుపాయాలను మెరుగు పరుచుకునేందుకు వారు ప్రయత్నిస్తారని తెలిపింది. అందుకనే తాము తమ ఔట్లెట్లలో 40 శాతం మేర స్టోర్లను గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. గ్రామీణ మహోత్సవ్(Grameen Mahotsav) కార్యక్రమంలో భాగంగా తమ వాహనాలను మరింత జనానికి తెలిసేలా చేస్తామని తెలిపింది.