Premalu Success Meet: మలయాళంలో అంతా బెస్ట్ యాక్టర్సేనని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈర్ష్య, బాధతో అయినా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిదేనని అన్నారు. ప్రేమలు మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్న రాజమౌళి ఈ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మలయాళం సినిమా ప్రేమలును తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు.. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్‌కు రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఈ మీట్లో రాజమౌళి మాట్లాడుతూ… తనకు యాక్షన్, ఫైట్లే ఇష్టమని అన్నారు. రొమాంటిక్, కామెడీ సినిమాలు అంతగా నచ్చవని చెప్పారు. అందుకే ఇష్టం లేకుండానే ప్రేమలు(Premalu) సినిమాని చూడటానికి వెళ్లానని అన్నారు. అయితే సినిమా మొదటి నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉన్నానని అన్నారు. ఈ సినిమాకి డైలాగులు రాసిన 90స్ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్యపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. మలయాళం సినిమాలో డైలాగులు ఎలా ఉన్నాయో తనకు తెలియదు కాని తెలుగులో మాత్రం అతను రాసిన డైలాగులకు పడి పడి నవ్వుకున్నట్లు చెప్పారు.
డైలాగులు రాసిన వ్యక్తి పేరు తెలియదని చెప్పడంతో పక్కనే ఉన్న ఆదిత్య వచ్చి తన పేరు చెప్పారు. ఈ సక్సెస్ మీట్లో రాజమౌళితో పాటు సంగీత దర్శకుడు కీరవాడి, డైరెక్టర్లు అనుదీప్, అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ప్రేమలు(Premalu) మూవీ తెలుగులో మార్చి 8న రిలీజై సంచలన విజయం సాధించింది. మహేష్ బాబు, నాగ చైతన్యలాంటి వాళ్లు కూడా ఈ సినిమాను చూసి రివ్యూలు రాయడం విశేషం.