TG: సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం పెంచితే స్మగ్లింగ్ మరింత పేట్రేగిపోతుందని టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(TII) హెచ్చరించింది. ఇప్పటికే దేశంలో ప్రతి 3 సిగరెట్లలో ఒకటి అక్రమ రవాణాదేనని తెలిపింది. డ్యూటీ పెంపు వల్ల రైతులు, రీటైలర్లు తీవ్రంగా నష్టపోతారని.. అక్రమ దందాలకు ఇది వరమవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రం వెంటనే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని TII కోరింది.