ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలంలోని పెద అలవలపాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పువ్వాడి నాగరాజు కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్య శాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పిలుపుమేరకు ఆసుపత్రి అభివృద్ధికి నాగరాజు రూ.1,11,111 లు విరాళంగా అందజేశారు. గురువారం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని కలిసి అందుకు సంబంధించిన చెక్కును అందజేశారు.