TG: హైదరాబాద్లో ఈ ఏడాది భారీగా ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తెచ్చేలా RTC ప్రణాళికలు చేస్తోంది. ఫిబ్రవరి నాటికి 170 EV బస్సులతోపాటు దశలవారీగా ఏడాదిలో వెయ్యి బస్సులను తీసుకురానుంది. గ్రేటర్ జోన్లో 25 బస్ డిపోలు ఉండగా ఇప్పటికే కంటోన్మెంట్, మియాపూర్, రాణిగంజ్, హయత్ నగర్, HCU డిపోలలో EV ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.