GNTR: తెనాలిలో గత ఎనిమిది రోజులుగా పెరుగుతున్న గాలి కాలుష్యం, పొగమంచు వల్ల ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జలుబు, ఆస్థమాతో ఇబ్బంది పడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వైద్యులు తెలుపుతున్నారు.