KMR: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డులకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించినట్లు కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాను రూపొందించి, ముసాయిదా జాబితాను సిద్ధం చేసి ప్రదర్శించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.