TG: విభజనచట్టంలో పరిమితుల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. UPA చేసిన అన్యాయాన్ని మోదీ సర్కార్ సరిదిద్దిందని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డిపై నీటి వివరాలు ఇవ్వకుండా 2 ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని.. అందుకే DPRను కేంద్రం వెనక్కి పంపిందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కాంగ్రెస్, BRS క్షమాపణ చెప్పాలన్నారు.