TG: ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు చేపడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రణాళిక, విశ్లేషణ, డిజైన్‌పై 18 నెలల్లో డీపీఆర్ సమర్పిస్తామన్నారు. బ్లూ, గ్రీన్, ల్యాండ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన, గాంధీ సరోవర్ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు. అలాగే, రక్షణశాఖ భూముల కోసం రక్షణశాఖ అధికారులకు ప్రతిపాదన పంపినట్లు పేర్కొన్నారు.