మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ చిత్రం ట్రైలర్‌ను జనవరి 4న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను తిరుపతిలో నిర్వహించనున్నట్లు టాక్. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు.