TG: వైఎస్సార్ హయాంలోనే మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం చేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కోల్డ్ స్టోరేజీలో వేశాయని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు.. సీఎం మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. గతంలో 12 వేల ఇళ్లు తరలించాలని నిర్ణయించారని తెలిపారు.