PPM: అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే డ్రైడే-ఫ్రైడే తప్పనిసరిగా పాటించాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ పి.ఎల్. రఘు అన్నారు. సీతానగరం మండలం లచ్చయ్య పేట గ్రామంలో డ్రై డే-ఫ్రైడే నిర్వహణ తీరును శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యర్థాలు కాలువల్లో, రోడ్లపై వేయరాదని సూచించారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా ఉంచి వీధుల్లో చెత్త సేకరిస్తున్న వారికి అందించాలన్నారు.