GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు వెల్లువెత్తాయి. డిసెంబర్ నెలలో గుంటూరులో రూ.254.51 కోట్లు, పల్నాడులో రూ.105.12 కోట్ల వ్యాపారం జరగ్గా, చివరి 10 రోజుల్లోనే రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.114 కోట్లు అమ్ముడయ్యాయి. ఇక డిసెంబర్ 31 ఒక్కరోజే గుంటూరులో రూ.12.96 కోట్లు, పల్నాడులో రూ. 5.72 కోట్ల ఆదాయం రావడం గమనార్హం.