TG: కాంగ్రెస్, బీఆర్ఎస్పై కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై బురదజల్లుతున్నాయని మండిపడ్డారు. 299 టీఎంసీలు చాలని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన వాటాను ఏపీకి ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. ఒప్పంద పత్రాలను తానే బయటపెట్టానని గుర్తు చేశారు.