TG: HYDలోని అశోక్‌నగర్-దోమలగూడ లింకు బ్రిడ్జిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఎంపీ అనిల్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్, GHMC కమిషనర్ హాజరయ్యారు. హుస్సేన్‌సాగర్ నాలాపై రూ.6 కోట్లతో లింకు బ్రిడ్జి నిర్మించారు. దీంతో చిక్కడపల్లి నుంచి అశోక్‌నగర్, దోమలగూడ వైపు రాకపోకలకు సులభతరం కానున్నాయి.