TG: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సభలో బిల్లు ప్రవేశపెట్టాలని స్పీకర్ ప్రసాద్ కోరారు. సభ ముందు పురపాలక, జీహెచ్ఎంసీ, ప్రైవేట్ వర్సిటీలు, మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.