SS: నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్‌ను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో పాలనా యంత్రాంగం చొరవ చూపాలని ఈ సందర్భంగా చర్చించారు.