రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.1000కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. నార్త్ అమెరికాలో కూడా ఈ చిత్రం అదరగొడుతోంది. అక్కడ 17.50 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్స్ సాధించి ‘పఠాన్’ $17.49 మిలియన్ల వసూళ్లను దాటినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో అమెరికాలో ‘బాహుబలి 2′, కల్కి’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా నిలిచిందని పేర్కొన్నాయి