MDK: ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయంలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవను నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని పల్లకీలో ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ఊరేగించనున్నారు. పల్లకి సేవా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయాలన్నారు.