ADB: నార్నూర్ మండల కేంద్రంలోని కొమురంభీం భవనంలో ఈ నెల 4వ తేదీన ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘం మండల స్థాయి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఇవాళ ఆ సంఘం ప్రధాన కార్యదర్శి అర్క గోవింద్ గెలిపారు. ఇందులో భాగంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఉదయం 11.15 గంటలకు జరిగే ఎన్నికలకు ఆదివాసీలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.