అన్నమయ్య: మదనపల్లి అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల గోడపత్రికను గురువారం ఆవిష్కరించారు. ఈ నెల 1 నుంచి 31 వరకు రహదారి భద్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రహదారులపై ప్రమాదాలను నివారించడమే ప్రధాన లక్ష్యమని, జిల్లా ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు.